News November 10, 2024
ఉగ్రదాడిలో ఆర్మీ అధికారి మృతి

జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కిష్ట్వార్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మరణించారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులు మరణించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.
Similar News
News November 24, 2025
వారంలోగా సమస్యలు పరిష్కరించాలి: కాకినాడ ఎస్పీ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. వీటిలో భూ తగాదాలు 10, కుటుంబ సమస్యలు 8, ఇతరత్రా 24 ఉన్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ అర్జీలను వారంలోగా పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఎస్పీ ఆదేశించారు.
News November 24, 2025
హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.
News November 24, 2025
భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.


