News November 9, 2024
ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నా: MLA కైజర్

తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నానని NC MLA కైజర్ జంషైద్ వెల్లడించారు. J&K అసెంబ్లీలో మాట్లాడుతూ ‘అప్పుడు నాతో సహా 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో చేరిన వ్యక్తి గురించి తెలియదనడంతో కొట్టారు. దీంతో తాను మిలిటెంట్ అవ్వాలనుకుంటున్నానని సీనియర్ ఆఫీసర్తో చెప్పా. ఆయన తన సహోద్యోగిని మందలించడంతో వ్యవస్థపై నమ్మకం వచ్చింది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 4, 2026
‘భోగా’పురం మంటలు

AP: భోగాపురం ఎయిర్పోర్టు <<18758900>>వైభోగానికి<<>> తామే కారణమంటూ టీడీపీ, వైసీపీ ప్రకటనలు చేస్తున్నాయి. తమ పాలనలో వేగంగా అనుమతులు తీసుకురావడం వల్లే ఈ మైలురాయి చేరుకున్నామని జగన్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్టును అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్దేనని, ఇలా చెప్పుకోవడానికి వైసీపీకి సిగ్గుండాలని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. మోదీ-CBN వల్లే నిర్మాణం పూర్తయిందని కౌంటర్ ఇచ్చారు.
News January 4, 2026
వాస్తు ఎందుకు పాటించాలి?

వాస్తు పాటించడమంటే గోడలు, దిశలు మార్చడం కాదని గాలి, వెలుతురు వంటి ప్రకృతి శక్తులతో మన జీవితాన్ని అనుసంధానించుకోవడమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ప్రసరించే ఇంట్లో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. సానుకూల శక్తితో కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు బలపడి, ఉన్నతమైన ఆలోచనలను ప్రేరేపిస్తాయి. సమాజంలో గౌరవాన్ని, ఆర్థిక వృద్ధిని అందిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 4, 2026
అంధకారంలో వెనిజులా.. స్తంభించిన జనజీవనం

వెనిజులాపై అమెరికా <<18750335>>వైమానిక దాడుల<<>> తర్వాత ఆ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విద్యుత్ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రాజధాని కరాకస్ సహా ప్రధాన నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఆహారం, అత్యవసర మందుల కోసం ప్రజలు బారులు తీరారు. ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి ప్రజలు రోడ్లపై పనిచేస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ వద్దకు చేరుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.


