News March 12, 2025
సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

TG: 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్మెన్, స్టోర్ కీపర్ పోస్టుల భర్తీ కోసం టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 17.5 నుంచి 21 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు ఏప్రిల్ 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు, బరువు, ఛాతి, జీతం తదితర వివరాల కోసం పూర్తి <
Similar News
News January 7, 2026
IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు గుడ్న్యూస్

IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ ఓపెనింగ్ డే (60 రోజుల ముందు)లో ఉదయం 8 నుంచి సా.4 గంటల వరకు టికెట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆధార్ లింక్ లేకుంటే సా.4 గంటల తర్వాత మాత్రమే బుక్ చేసుకోగలరు. అయితే, JAN 12 నుంచి వెరిఫైడ్ యూజర్ల బుకింగ్ టైమ్ రాత్రి 12 గంటల వరకు పొడిగించనుంది. దీంతో, నాన్ వెరిఫైడ్ యూజర్లు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేరు.
News January 7, 2026
ఏడాది లోపు పిల్లలకు కొబ్బరి నీరు ఇవ్వొచ్చా?

6 నెలలు దాటిన తర్వాత పిల్లలకు కొబ్బరి నీటిని చాలా తక్కువ పరిమాణంలో 1, 2 స్పూన్లు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. తర్వాత పరిమాణాన్ని నెమ్మదిగా పెంచాలి. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన లేదా ఫ్లేవర్డ్ కొబ్బరి నీటిని అస్సలు ఇవ్వకూడదు, ఎందుకంటే వాటిలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. గ్యాస్, అతిసారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలుంటే వారికి కొబ్బరినీరు ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు.
News January 7, 2026
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? క్లారిటీ

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. బీరు తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలు ఒత్తిడికి గురై రాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీరులోని ప్యూరిన్తో యూరిక్ యాసిడ్ పెరిగి కొత్త రాళ్లు ఏర్పడవచ్చు. మూత్రంలో ప్రెజర్ పెరిగి రాయి బ్లాడర్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.


