News February 22, 2025
త్వరలో ఆర్మీ చేతికి 220 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్

తమ అమ్ములపొదిని మరింత శక్తిమంతం చేసుకునేందుకు, గగనతల ప్రమాదాల నుంచి రక్షణకు 220 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్‌ను కొనుగోలు చేయాలని ఆర్మీ భావిస్తోంది. ఈ ఏడాది జూలైలో రెండు దేశీయ సంస్థల ఉత్పత్తుల్ని పరీక్షించనుంది. 1990వ దశకం తర్వాత ఆర్మీ ఈ తరహా వ్యవస్థల్ని కొనుగోలు చేయలేదు. అప్పట్లో కొన్న L-70, Zu-23 వ్యవస్థలు ఔట్‌డేటెడ్ అయిపోయాయి. వాటి స్థానంలోనే ఈ కొత్త గన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Similar News
News February 22, 2025
BREAKING: రాష్ట్రంలో 14,236 ఉద్యోగాలు

TG: రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైంది. 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
News February 22, 2025
పంట పొలంలో పెళ్లి.. వైరల్

భారీ ఫంక్షన్ హాల్, డెకరేషన్, డీజే చప్పుళ్ల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో పంజాబ్‌కు చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని పంట పొలం మధ్య వివాహం చేసుకుని దుర్లభ్ సింగ్, హర్మన్‌కౌర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు చేసిన పోరాట నినాదాలను ముద్రించిన స్వీట్ బాక్సులను అతిథులకు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
News February 22, 2025
కాంగ్రెస్ అసమర్థత వల్లే SLBC ఘటన: హరీశ్

TG: SLBC <<15542138>>సొరంగం<<>> కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనమని హరీశ్‌రావు మండిపడ్డారు. 4 రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతోందని తెలిసినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు, KTR స్పందిస్తూ.. ఘటన ఉ.8:30కు జరిగితే మధ్యాహ్నం దాకా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.