News August 11, 2024
ఆర్మీ వాహనానికి నిప్పంటించిన మూకలు

బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. గోపాల్గంజ్లో ఆర్మీ వాహనానికి మూకలు నిప్పంటించిన విషయం ఆలస్యంగా తెలిసింది. షేక్ హసీనా తిరిగి రావాలని వేలమంది అవామీ లీగ్ సపోర్టర్స్ ఢాకా-ఖుల్నా హైవేను బ్లాక్ చేశారు. ఆదేశించినప్పటికీ వారు రోడ్డు ఖాళీ చేయకపోవడంతో ఆర్మీ అధికారులు లాఠీలు ఉపయోగించారు. దీంతో వారు వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇద్దరికి బుల్లెట్లు తగిలాయని సమాచారం.
Similar News
News October 27, 2025
గంటకు 18కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాను

AP: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మొంథా’ తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తోందని APSDMA తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ప్రస్తుతానికి చెన్నైకి 600KM, విశాఖపట్నానికి 710KM, కాకినాడకు 680KM దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. తీరం వెంబడి గంటకు 90-110KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News October 27, 2025
నేల లోపల గట్టి పొరలుంటే ఏమి చేయాలి?

కొన్ని నేలల్లో లోపల గట్టి పొరల వల్ల సాగు సమస్యగా మారి దిగుబడి ఆశించినంతగా రాదు. ఇలాంటి భూముల్లో ఉపరితలం నుంచి మీటరు వెడల్పున గుంత తవ్వుతూ వెళ్తే కొంత లోతున గట్టి పొరలు కనబడతాయి. గట్టి పొరకు పైన, కింద మామూలు మట్టి ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో పెద్ద ట్రాక్టరుతో లోతు దుక్కులు చేసుకోవాలి. దీంతో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 2 టన్నుల జిప్సం వేస్తే 10 నుంచి 12 శాతం అధిక దిగుబడి పొందవచ్చు.
News October 27, 2025
అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఉద్యోగాలు

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 7 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సైంటిస్ట్-B, సైంటిస్ట్-C పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు DEC 8 వరకు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సైంటిస్ట్-B పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు, సైంటిస్ట్ -C పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: serb.gov.in/


