News May 25, 2024
ఆరోగ్య శ్రీ సేవలు యథాతథం

AP: ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు దిగివచ్చాయి. సీఎస్ జవహర్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో స్కీమ్ సేవల్ని యథాతథంగా కొనసాగించనున్నట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మరో రూ.300 కోట్ల నిధుల విడుదలకు సీఎస్ హామీ ఇచ్చినట్లు పేర్కొంది. మొత్తంగా ఈ పథకం కింద సేవలు అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్ల బకాయి పడింది. ఇటీవల రూ.203 కోట్లు విడుదల చేసింది.
Similar News
News November 19, 2025
న్యూస్ రౌండప్

✦ TGలో నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. మ.12 గంటలకు HYD నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీని ప్రారంభించనున్న CM రేవంత్
✦ పార్టీ ఫిరాయింపులపై నేడు, రేపు MLAల విచారణ.. నేడు తెల్లం వెంకట్రావు, సంజయ్, రేపు పోచారం, అరికెపూడి గాంధీకి సంబంధించిన పిటిషన్ల విచారణ
✦ రేపు బిహార్కు CM CBN, మంత్రి లోకేశ్.. నితీశ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడంతో పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ
News November 19, 2025
మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.
News November 19, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

సినీ నటి తులసి యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. ‘శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.


