News August 31, 2025

అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు

image

TG: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే <<17479379>>ప్రభుత్వానికి లేఖ<<>> రాశామని, అయినా స్పందన రాలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. బిల్లుల పెండింగ్‌‌తో చిన్న, మధ్యస్థాయి ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News September 1, 2025

వేడితో వయసు కర్పూరంలా కరుగుతోంది!

image

గ్లోబల్ వార్మింగ్‌తో ఇంటి కరెంటు బిల్లే కాదు ఒంటి వయసూ పెరుగుతోంది. హీట్‌వేవ్స్ వల్ల లివర్, లంగ్స్, కిడ్నీలు ప్రభావితమై దెబ్బతింటాయని నేచర్ క్లైమెట్ ఛేంజ్ జర్నల్ పేర్కొంది. ఉదాహరణకు బాడీపార్ట్స్ పదేళ్లు పనిచేసి దెబ్బతినే స్థాయి హీట్‌తో ముందే ఆ లెవల్‌కు చేరుతాయని తైవాన్‌లో 14 ఏళ్ల పరిశోధనతో వెల్లడైంది. 2025-29 వరకు ఉష్ణోగ్రతలు సగటున 1.5° పెరుగుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చెప్పడం గమనార్హం.

News September 1, 2025

మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కుట్రలు చేసినా చట్టపరంగా పోరాడతామని KTR అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో రాహుల్ గాంధీ కరెన్సీ మేనేజర్ (CM) కాళేశ్వరం కేసును CBIకి అప్పగించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధేమో బీజేపీకి CBI “ప్రతిపక్ష ఎలిమినేషన్ సెల్”లా పనిచేస్తోందని గతంలో ఆరోపించారు. మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా’ అని KTR ప్రశ్నించారు.

News September 1, 2025

చంద్రబాబు పాలన తెలుగు రాష్ట్రాలకు స్వర్ణయుగం: గొట్టిపాటి

image

AP: ఉమ్మడి రాష్ట్ర CMగా చంద్రబాబు HYDను ప్రపంచపటంలో నిలబెట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ‘CBN పాలన తెలుగు రాష్ట్రాలకు స్వర్ణయుగం. విజన్ 2020కలను సాకారం చేసి చూపించారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో AP అభివృద్ధికి బాటలేశారు’ అని ప్రశంసించారు. చంద్రబాబు CMగా తొలిసారి బాధ్యతలు తీసుకుని 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా మంగళగిరి TDP ఆఫీస్‌లో నేడు వేడుకలు నిర్వహించనున్నారు.