News August 9, 2024
రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723173429641-normal-WIFI.webp)
TG: ఆరోగ్య శ్రీ పథకానికి అర్హత, పాత కార్డుల అప్డేట్, కొత్త పేర్ల ఎంట్రీ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. మార్గదర్శకాల తయారీ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రేషన్‌కార్డును పరిగణనలోకి తీసుకోకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రం ద్వారా అర్హులను గుర్తించనున్నారు. ఆరోగ్యశ్రీ కోసం దాదాపు 10 లక్షలు, కార్డుల్లో సభ్యులను చేర్చేందుకు మరో 11 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 6, 2025
INDvsENG: నేడే తొలి వన్డే.. మ.1.30 గంటలకు ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738784417526_695-normal-WIFI.webp)
నాగ్‌పూర్ వేదికగా నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి ODI జరగనుంది. మ.1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20ల్లో చూపిన జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని IND ఉవ్విళ్లూరుతోంది. రోహిత్, కోహ్లీ, గిల్, రాహుల్, శ్రేయస్, హార్దిక్, అక్షర్, జడేజా, షమీ, అర్ష్‌దీప్, కుల్దీప్, సుందర్, వరుణ్‌లతో జట్టు సమతూకంగా ఉంది. అటు వన్డేల్లో బోణీ కొట్టాలని ENG ఆరాటపడుతోంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News February 6, 2025
ఉపాధి కూలీలకు ₹6,434 కోట్లు బకాయి పడిన కేంద్రం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738802805927_1045-normal-WIFI.webp)
MGNREGA పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కేంద్రం చెల్లించాల్సిన వేతనాలు బకాయిలు రూ.6,434 కోట్ల వరకూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేశ్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. అత్యధికంగా తమిళనాడుకు రూ.1652 కోట్లు, UPకి రూ.1214 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2022-23 కాలంలో దేశవ్యాప్తంగా 86.17 లక్షలమంది, 2023-24లో 68.86 లక్షలమంది కూలీలను తొలగించినట్లు వెల్లడించారు.
News February 6, 2025
రుణం కంటే రెట్టింపు వసూలు.. విజయ్ మాల్యా పిటిషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738801970360_695-normal-WIFI.webp)
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.6,200 కోట్ల అప్పునకు బ్యాంకులు రూ.14,131 కోట్ల ఆస్తులను రికవరీ చేశాయని తెలిపారు. అయినా ఇంకా జప్తు కొనసాగుతోందని, దీనిపై స్టే విధించాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13లోగా స్పందించాలని న్యాయస్థానం 10 బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది.