News September 5, 2025

ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు: జగన్

image

AP: రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని CM చంద్రబాబు భ్రష్టు పట్టించారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ‘‘ఈ 15 నెలల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన రూ.4,500 కోట్లకు గానూ కేవలం రూ.600 కోట్లే ఇచ్చారు. ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు అందించే ‘ఆరోగ్య ఆసరా’ను సమాధి చేశారు. దీనికి ఇవ్వాల్సిన దాదాపు రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు’’ అని ఆరోపించారు.

Similar News

News September 6, 2025

వరద ప్రభావిత రాష్ట్రాల్లో PM మోదీ పర్యటన?

image

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాలంలో హిమాచల్‌ప్రదేశ్, J&K, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వరదలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆయా ప్రాంతాలను ప్రధాని పరిశీలించి, నష్టంపై సమీక్షిస్తారని సమాచారం.

News September 6, 2025

బీసీ సంక్షేమశాఖకు స్కోచ్ అవార్డ్

image

AP: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు వరించింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే BC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించినందుకుగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డును మంత్రి సవిత అందుకోనున్నారు. కాగా రాష్ట్రంలో BC స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, టీచర్స్, రైల్వే వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు శిక్షణ అందించారు.

News September 6, 2025

అమెరికాకు భారత్ తలవంచుతుంది: ట్రంప్ సలహాదారు

image

ట్రంప్ సలహాదారు హోవర్డ్ లుత్నిక్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ వ్యవహారంలో అగ్రరాజ్యం ముందు ఇండియా తలవంచుతుందన్నారు. అమెరికాకు ‘సారీ’ చెప్పి అధ్యక్షుడు ట్రంప్‌తో డీల్ కుదుర్చుకుంటుందని అహంకారపూరిత కామెంట్స్ చేశారు. US మార్కెట్ లేకుండా IND ఆర్థికంగా వృద్ధి చెందలేదన్నారు. ‘ఒకటి, రెండు నెలల్లో USతో చర్చలకు భారత్ దిగొస్తుంది. మోదీతో ఎలా డీల్ చేసుకోవాలో ట్రంప్‌కు తెలుసు’ అని హోవర్డ్ అన్నారు.