News June 3, 2024
తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఇలా

* 17 నియోజకవర్గాల్లో 525 మంది పోటీ
* ఉ.8కి కౌంటింగ్ ప్రారంభం
* 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
* 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు
* ఓట్ల లెక్కింపునకు సుమారు 10,000 మంది సిబ్బంది నియామకం
* కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా
* రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, మద్యం షాపులు బంద్
Similar News
News September 16, 2025
వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.
News September 16, 2025
OTTలోకి ‘వార్-2’ వచ్చేది అప్పుడేనా?

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఓటీటీ(నెట్ఫ్లిక్స్)లో రిలీజయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం 6-8 వారాల్లో సినిమాలు OTTలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.
News September 16, 2025
విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.