News August 9, 2024
కరుడుగట్టిన టెర్రరిస్ట్ అరెస్ట్

స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఢిల్లీ పోలీసులు కరుడుగట్టిన ఐసిస్ మాడ్యూల్ టెర్రరిస్టు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీని అరెస్టు చేశారు. అతనిపై NIA గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసి రూ.3 లక్షల రివార్డు ప్రకటించింది. గతంలో పూణె పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న రిజ్వాన్ తాజాగా ఢిల్లీలోని దర్యాగంజ్లో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 11, 2026
APPLY NOW: NABARDలో 44 పోస్టులు

<
News January 11, 2026
‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజాసాబ్’ సినిమా భారత్లో రెండు రోజుల్లో ₹108.4కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెబ్సైట్ పేర్కొంది. ప్రీమియర్లకు ₹11.3Cr, తొలి రోజు ₹64.3Cr, రెండో రోజు ₹32.84Cr కలెక్షన్స్ వచ్చినట్లు వెల్లడించింది. హిందీలో 2 రోజుల్లో ₹11.2Cr రాబట్టినట్లు తెలిపింది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹112Cr+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 11, 2026
ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.


