News March 21, 2024
కేజ్రీవాల్ అరెస్ట్.. 2022లోనే చెప్పిన ఆస్ట్రాలజర్

సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిషం నిజమైంది. ‘మార్చి 2024 నుంచి కేజ్రీవాల్‌కు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అరెస్ట్ అవుతారు. తర్వాత ఢిల్లీ సీఎం ఎవరో కూడా నాకు తెలుసు. తర్వాత చెబుతా. అతడి కర్మ ఫలం 2025 ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుంది. తర్వాత నుంచి కేజ్రీవాల్ రాజకీయ పతనం మొదలవుతుంది’ అని 2022 మార్చి 25న ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News September 13, 2025
213 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యూపీఎస్సీలో 213 లెక్చరర్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. LLB, MBBS చేసిన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి OCT 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 50ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
#ShareIt
News September 13, 2025
IPSల బదిలీలు.. ఈ జిల్లాలకు కొత్త ఎస్పీలు

AP: ఏపీ ప్రభుత్వం ఐపీఎస్‌లను బదిలీ చేసింది. గుంటూరు-వకుల్ జిందాల్, పల్నాడు-డి.కృష్ణారావు, ప్రకాశం-హర్షవర్ధన్ రాజు, చిత్తూరు-తుషార్ డూడీ, సత్యసాయి-సతీశ్ కుమార్, కృష్ణా-విద్యాసాగర్ నాయుడు, విజయనగరం-ఏఆర్ దామోదర్, నంద్యాల-సునీల్ షెరాన్, అంబేడ్కర్ కోనసీమ- రాహుల్ మీనా, కడప-నచికేత్, అన్నమయ్య-ధీరజ్ కునుగిలి, తిరుపతి-సుబ్బారాయుడు, నెల్లూరు-అజితా వేజెండ్ల, బాపట్ల-ఉమామహేశ్వర్‌ను నియమించింది.
News September 13, 2025
తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

GST సవరణ నేపథ్యంలో ప్రముఖ FMCG బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. రూ.490 ఉండే డవ్ షాంపూ(340ml) రూ.435కే లభించనుంది. రూ.130 హార్లిక్స్ జార్(200g) రూ.110, రూ.68 లైఫ్‌బాయ్ సబ్బు(75gX4) రూ.60, రూ.96 లక్స్ సబ్బు(75gX4) రూ.85, రూ.300 బ్రూ (75g) రూ.284, రూ.124 బూస్ట్(200g) రూ.110, రూ.154 క్లోజప్ (150g) రూ.129కే అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22 నుంచి ఈ ధరలు అమలవుతాయి.