News March 29, 2024

కేజ్రీవాల్ అరెస్ట్.. జర్మనీ, అమెరికా బాటలోనే యూఎన్ కూడా!

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించి కేంద్రం నుంచి జర్మనీ, అమెరికాలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఐక్యరాజ్య సమితి చేరింది. ‘భారత్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌర హక్కులకు భంగం కలగకుండా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నాము’ అని UN పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందా? అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది.

Similar News

News November 26, 2025

ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

image

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 26, 2025

RRCATలో 150 పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

image

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(<>RRCAT<<>>)లో 150 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. 18- 24ఏళ్లు ఉండి, ITI అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NAPS అప్రెంటిస్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rrcat.gov.in/

News November 26, 2025

26/11: మానవత్వం చాటుకున్న రతన్ టాటా!

image

ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా ఆర్మీ అధికారులకు అందించిన సపోర్ట్‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన 3 రోజులు తాజ్ హోటల్ వెలుపలే నిలబడి సహాయక చర్యల్లో భాగమై మానవత్వాన్ని చాటారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆస్తినష్టం జరిగినా పర్లేదని ఆర్మీని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, బాధితుల కుటుంబాలకు ఆయన చికిత్స అందించి ఆర్థికంగా కూడా మద్దతుగా నిలిచారు.