News December 11, 2024
మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

TG: జల్పల్లిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంచు విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్పై దాడి కేసులో ఆయనను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి జరిగిందని మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరో నిందితుడు వినయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 27, 2025
పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <


