News February 2, 2025

రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్

image

యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై కేరళలోని ఓ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రామ్‌దేవ్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు రావాలని ఆదేశించినా వారు రాకపోవడంతో కోర్టు తాజా తీర్పునిచ్చింది.

Similar News

News October 27, 2025

11AMకు లక్కీ డ్రా.. అదృష్టం ఎవరిని వరించేనో?

image

TG: మద్యం షాపులకు ఇవాళ 11AMకు అన్ని జిల్లాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్లు లక్కీ డ్రా తీయనున్నారు. 2,620 మద్యం షాపులకు 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ.3 లక్షలు ఉన్నప్పటికీ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్క షాపు తగిలినా లైఫ్ సెట్ అవుతుందనే ఉద్దేశంతో పలువురు పదుల సంఖ్యలో అప్లికేషన్స్ పెట్టారు. మరి ఎవరి లక్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. మీరూ అప్లై చేశారా?

News October 27, 2025

గంటకు 18కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాను

image

AP: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మొంథా’ తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తోందని APSDMA తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ప్రస్తుతానికి చెన్నైకి 600KM, విశాఖపట్నానికి 710KM, కాకినాడకు 680KM దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. తీరం వెంబడి గంటకు 90-110KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

News October 27, 2025

నేల లోపల గట్టి పొరలుంటే ఏమి చేయాలి?

image

కొన్ని నేలల్లో లోపల గట్టి పొరల వల్ల సాగు సమస్యగా మారి దిగుబడి ఆశించినంతగా రాదు. ఇలాంటి భూముల్లో ఉపరితలం నుంచి మీటరు వెడల్పున గుంత తవ్వుతూ వెళ్తే కొంత లోతున గట్టి పొరలు కనబడతాయి. గట్టి పొరకు పైన, కింద మామూలు మట్టి ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో పెద్ద ట్రాక్టరుతో లోతు దుక్కులు చేసుకోవాలి. దీంతో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 2 టన్నుల జిప్సం వేస్తే 10 నుంచి 12 శాతం అధిక దిగుబడి పొందవచ్చు.