News December 31, 2024

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్

image

దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన యూన్ సుక్‌ను అరెస్టు చేయాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో సైనిక పాలన విధించేందుకు యూన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఆయన్ను విచారించాలని కోర్టు అధికారుల్ని ఆదేశించింది. ఆయన కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 23, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లాలో గత రెండు రోజులుగా చలి తీవ్రత తగ్గింది. గడిచిన 24 గంటలలో వెల్దండ మండలం బొల్లంపల్లిలో 18.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వటవర్లపల్లి 18.4, తెలకపల్లి 18.7, తోటపల్లి 18.8, సిరసనగండ్ల 18.9, అమ్రాబాద్, కొండారెడ్డిపల్లి 19.0, వంకేశ్వర్, ఊర్కొండ 19.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>