News November 27, 2024
జెండా విషయంలో అరెస్టు

బంగ్లాలోని ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25న ఢాకాలో ‘సనాతన్ జాగరణ్ మంచా’ పేరుతో యువకులు ర్యాలీ చేశారు. అందులో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఉంచారు. తమ దేశ జెండాను అవమానపరిచారంటూ కృష్ణదాస్ సహా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీల హక్కుల కోసం పోరాడే ఓ సంస్థకు చిన్మయ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
Similar News
News October 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 16, 2025
IPS పూరన్ భార్య, బావమరిదిపై కేసు

IPS పూరన్ కుమార్ సూసైడ్, ఆపై ASI సందీప్ ఆత్మహత్య వ్యవహారం మరిన్ని ట్విస్టులతో సాగుతోంది. సందీప్ భార్య ఫిర్యాదుతో పూరన్ భార్య అమ్నీత్(IAS), బావ మరిది అమిత్ రట్టన్(MLA), సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ వీడియో, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. కేసు పెట్టే వరకు సందీప్ పోస్టుమార్టానికి ఆయన కుటుంబం అంగీకరించలేదు.
News October 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 16, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.