News September 2, 2025
రేప్ కేసులో అరెస్టు.. పోలీసులపై MLA కాల్పులు

పంజాబ్ సానౌర్ నియోజకవర్గ AAP MLA హర్మీత్ సింగ్ పతాన్‌మజ్రా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. రేప్ కేసులో అరెస్టైన ఆయన్ను స్థానిక స్టేషన్‌కు తరలించారు. అక్కడ తన అనుచరులతో కలిసి ఆయన పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసుకు గాయాలయ్యాయి. పారిపోయే క్రమంలో మరో అధికారిని కారుతో గుద్దినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News September 2, 2025
టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు

AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్‌కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
News September 2, 2025
అఫ్గాన్ భూకంపం.. 1,400 మందికిపైగా మృతి

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన <<17587630>>భూకంప ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 3,124 మంది గాయపడ్డారని, 5,412 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత కునార్ ప్రావిన్సులోని ఆసదాబాద్, నుర్గల్, ఛౌకే, వాటాపూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
News September 2, 2025
రేపు కవిత ప్రెస్‌మీట్

TG: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత రేపు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లోని జాగృతి ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.