News March 22, 2024
బెదిరింపులకు లొంగకపోవడంతోనే కేజ్రీవాల్ అరెస్ట్: కూనంనేని
TG: దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి BJP ప్రయత్నిస్తోందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. PM మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. BJP బెదిరింపులకు లొంగకపోవడంతోనే ఢిల్లీ CM కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఫైరయ్యారు. ఎన్నికల బాండ్ల ద్వారా BJPకి రూ.వేల కోట్లు వచ్చాయని, దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 26, 2024
అంబానీ బలగం ఇదే
రిటెన్షన్లు, వేలంలో కలిపి ముంబై ఇండియన్స్ 22 మంది ఆటగాళ్లను తీసుకుంది.
జట్టు: రోహిత్, బుమ్రా, హార్దిక్, బౌల్ట్, తిలక్, సూర్య, దీపక్ చాహర్, నమన్ ధీర్, శాంట్నర్, రాజ్ బవా, పుతుర్, రికెల్‌టన్, రాబిన్ మింజ్, షిర్జిత్, జాకబ్స్, అశ్వనీ కుమార్, ఘజన్‌ఫర్, టోప్లే, లిజాడ్, కర్ణ్ శర్మ, పెన్మత్స వెంకటసత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్.
News November 26, 2024
బ్రేకప్ నిజమే: హీరోయిన్ ప్రకటన
ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నట్లు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వెల్లడించారు. ప్రియుడు క్రిలి ఆక్సన్‌ఫాన్స్‌తో విడిపోయినట్లు చెప్పారు. ‘ఈ రోజుల్లో మనకు సెట్ అవుతాడని అనిపించే వ్యక్తి దొరకడం కష్టమైపోతోంది. అతడితో బ్రేకప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. అలాగని వ్యతిరేకం కాదు. అది భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తిపై డిపెండ్ అయ్యి ఉంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News November 26, 2024
లక్నో ఫుల్ టీమ్ ఇదే..
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంలో లక్నో సూపర్‌జెయింట్స్ 24 మందిని కొనుగోలు చేసింది.
జట్టు: రిషభ్ పంత్, పూరన్, మిల్లర్, బిష్ణోయ్, ఆకాశ్ దీప్, మయాంక్ యాదవ్, మోహ్‌సిన్, బదోనీ, మార్క్రమ్, మార్ష్, అవేశ్, సమద్, ఆర్యన్ జుయల్, హిమ్మత్, సిద్ధార్థ్, దిగ్‌వేశ్, షహబాజ్ అహ్మద్, ఆకాశ్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, హంగర్‌గేకర్, అర్షిన్, బ్రీట్జ్‌కే.