News August 6, 2025
లిక్కర్ కేసులో దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు: CM చంద్రబాబు

AP: లిక్కర్ కేసు అరెస్టులపై మంత్రులు మాట్లాడొద్దని CM చంద్రబాబు సూచించారు. దర్యాప్తు ఆధారంగానే ఆ కేసులో అరెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏడాది హాలిడే ముగిసిందని, ఇకపై అంతా పూర్తిస్థాయిలో యాక్టివేట్ అవ్వాలని పిలుపునిచ్చారు. చేసిన ప్రగతి చెప్పకపోతే నష్టపోతామని తెలిపారు. మంత్రులు తమ శాఖల్లో తీసుకున్న చర్యలు, వారు చేసిన అభివృద్ధిపై వచ్చే క్యాబినెట్ భేటీలో ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
Similar News
News August 7, 2025
మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్స్!

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹220 పెరిగి ₹1,02,550కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹94,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 7, 2025
IPL.. కెప్టెన్ మాతోనే ఉంటారు: RR

IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడి CSK లేదా KKRలోకి వెళ్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండించిన RR యాజమాన్యం సంజూను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అతడు తమ జట్టుకు ముఖ్యమైన, తిరుగులేని కెప్టెన్ అని చెప్పింది. సంజూతో పాటు మరే ఆటగాడిని ట్రేడ్ చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని RR వెల్లడించింది.
News August 7, 2025
ఇవాళ 3 పథకాలు ప్రారంభం

AP: చేనేత కార్మికుల కోసం 3 పథకాలను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందించే స్కీంను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో CM చంద్రబాబు ప్రారంభిస్తారు. చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు, చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై CM ప్రకటించనున్నారు. ప్రభుత్వం సుమారు 2.5 లక్షల చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.