News October 9, 2024
టాప్-10లోకి దూసుకొచ్చిన అర్ష్దీప్

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చారు. భారత్ తరఫున అర్ష్దీప్ ఒక్కరే టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్య 3, అక్షర్ పటేల్ 11వ స్థానం దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ 2, యశస్వీ జైస్వాల్ 4, రుతురాజ్ గైక్వాడ్ 9వ స్థానంలో ఉన్నారు.
Similar News
News December 6, 2025
నిఘాలో తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 6, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్చైన్ డెవలప్మెంట్లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.
News December 6, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.1,30,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.500 పతనమై రూ.1,19,300పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


