News January 22, 2025

చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్

image

టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించారు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ అవతరించారు. ఇప్పటివరకు ఆయన 97 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ (96) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించారు.

Similar News

News December 17, 2025

ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల

image

AP: ప్రజల ప్రాణాలతో CM చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల ప్రతులను పరిశీలించారు. పీపీపీ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. ప్రైవేటులో ఫ్రీగా వైద్యం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల్లో కొంత ఖర్చు చేసినా కాలేజీలు పూర్తవుతాయన్నారు.

News December 17, 2025

నాలుగో టీ20కి స్టార్ ప్లేయర్ దూరం!

image

దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కి భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ దూరమైనట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాలి వేలికి గాయం కావడంతో ఆయన మ్యాచ్ ఆడట్లేదని వెల్లడించాయి. కాగా తొలి మూడు టీ20ల్లోనూ గిల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు. అటు పొగమంచు కారణంగా ఇవాళ్టి మ్యాచ్ టాస్‌పై అంపైర్లు 7.30pmకి నిర్ణయం తీసుకోనున్నారు.

News December 17, 2025

కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది: హరీశ్ రావు

image

TG: రాజ్యాంగాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీ నినాదం ఉద్దేశం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన <<18592868>>తీర్పుతో<<>> బహిర్గతమైందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలతో రాజ్యాంగాన్ని కాలరాసిందని ఫైరయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని మండిపడ్డారు.