News July 25, 2024
టెస్టు జట్టులోకి అర్ష్దీప్ సింగ్? రాణిస్తారా?

టీమ్ఇండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారట. టెస్టులకు సిద్ధం చేసేందుకు SEP 5 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ, పలు దేశీయ రెడ్ బాల్ మ్యాచుల్లో అతడిని ఆడించాలని నిర్ణయించారట. గత 3, 4 ఏళ్లుగా IPLలో PBKS తరఫున, వైట్ బాల్ క్రికెట్లో IND తరఫున అర్ష్దీప్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లోనూ మెప్పిస్తారేమో వేచి చూడాలి.
Similar News
News September 17, 2025
రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT
News September 17, 2025
తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
News September 17, 2025
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

AP: ఇవాళ CM చంద్రబాబు విశాఖకు వెళ్లనున్నారు. AU కన్వెన్షన్ సెంటర్లో జరిగే ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో OCT 2వరకు చేపట్టనున్న ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు. మ.3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. తర్వాత VJA బయల్దేరతారు.