News November 14, 2024
రికార్డు నెలకొల్పిన అర్ష్‌దీప్ సింగ్
భారత పేస్ సెన్సేషన్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో సింగ్ 3 వికెట్లు తీశారు. దీంతో టీ20 కెరీర్లో మొత్తం 92 వికెట్లు సొంతం చేసుకొని టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్(90), బుమ్రా(89) ఉన్నారు. మొత్తంగా చూస్తే స్పిన్నర్ చాహల్(96) టాప్‌లో ఉన్నారు.
Similar News
News December 26, 2024
ఉగ్రవాది మసూద్ అజార్‌కు గుండెపోటు
జైషే మహమ్మద్ ఫౌండర్, టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ హార్ట్ ఎటాక్‌కు గురైనట్లు వార్తలొస్తున్నాయి. అఫ్గాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్‌లో ఉండగా గుండెనొప్పి రావడంతో చికిత్స కోసం పాక్‌లోని కరాచీకి తరలించారని సమాచారం. ప్రత్యేక వైద్యనిపుణులు ఇస్లామాబాద్ నుంచి కరాచీకి చేరుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేయడంతో భారత ప్రభుత్వం మసూద్‌ను జైలు నుంచి విడుదల చేసింది.
News December 26, 2024
రోహితే ఓపెనింగ్ చేస్తారు: నాయర్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంసీజీ టెస్టులో ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగుతారని జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు, మూడు టెస్టుల్లో శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను తిరిగి ఓపెనర్‌గా బరిలోకి దించాలని నిర్ణయించినట్లు నాయర్ పేర్కొన్నారు. కేఎల్ రాహుల్ 3వ స్థానంలో ఆడనున్నట్లు తెలుస్తోంది.
News December 26, 2024
ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో అంతరాయం!
ఎయిర్టెల్ నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మొబైల్ డేటా & బ్రాడ్‌బ్యాండ్ సేవలు రెండింటిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వెబ్సైట్ స్టేటస్ ట్రాకింగ్ టూల్ Downdetector.com ప్రకారం దాదాపు 46% మంది మొత్తం బ్లాక్అవుట్ను ఎదుర్కొంటున్నారు. 32% మందికి సిగ్నల్ లేదు & 22% మందికి మొబైల్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?