News October 19, 2024
గిన్నిస్ వరల్డ్ రికార్డు పేజీపై మెగాస్టార్‌పై కథనం

భారతీయ సినిమా రంగంపై చిరంజీవి చెరగని ముద్ర వేశారంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారిక పేజీలో ఆయనపై ఓ స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడిగా నిలిచారని, 143 సినిమాల్లో 537 పాటల్లో విభిన్న డాన్సులతో ఆకట్టుకున్నారని ప్రశంసించింది. సినిమాలపై చిరంజీవి ప్రభావం తరతరాలుగా మారి, ఆయనను భారతీయ సినిమాకు ఒక చిహ్నంగా మార్చిందంటూ మెగాస్టార్ కెరీర్ హైలైట్స్‌ను GWR పంచుకుంది.
Similar News
News January 19, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 19, 2026
బొగ్గు టెండర్ల పంచాయితీ.. నివేదిక కోరిన కేంద్రం!

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పాలసీ పరమైన లోపాలు జరిగినట్లు సమాచారం అందడంతో టెండర్ల ప్రక్రియ వివరాలు సమర్పించాలని సింగరేణిని కోరింది. సింగరేణిలో బొగ్గు మంత్రిత్వ శాఖకు 49%, తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉంది. బొగ్గు శాఖ నైనీ బ్లాకులను ఎస్సీసీఎల్కు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2025లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.
News January 19, 2026
బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్!

భద్రతా కారణాలతో T20 WC మ్యాచుల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ <<18885677>>కోరుతుండటం<<>> తెలిసిందే. ఈ క్రమంలో మార్పు సాధ్యం కాదని BCBకి ICC చెప్పినట్లు సమాచారం. తుది నిర్ణయం చెప్పేందుకు ఈ నెల 21 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ర్యాంకింగ్ ప్రకారం స్కాట్లాండ్ మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక వేదికగా WC ప్రారంభం కానుంది.


