News March 20, 2024
‘కృత్రిమ మామిడిపండ్ల’ ముఠా అరెస్ట్

వేసవి వచ్చేసింది. రోడ్ల పక్కన, మార్కెట్లలో మామిడిపండ్ల విక్రయం కూడా మొదలైంది. అయితే వాటిలో అన్నీ ప్రకృతి సిద్ధంగా మగ్గినవి కావని గుర్తుంచుకోండి. తాజాగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ పోలీసులు మామిడికాయలను కృత్రిమంగా మగ్గపెడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.12లక్షల విలువైన మామిడిపండ్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. మీరూ మామిడిపండ్లు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి.
Similar News
News November 28, 2025
HYD: విశిష్ట రంగస్థల పురస్కారం గ్రహీత.. ప్రొఫైల్ ఇదే!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావుకు 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం వరించింది. 2001లో K2 నాటికకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, తెలుగులో ‘ప్రతాప రుద్రమ’ నాటకానికి దర్శకత్వం వహించిన తొలి తెలుగువాడిగా ఘనత సాధించారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి సందర్శించారు.
News November 28, 2025
ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.
News November 28, 2025
ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.iimv.ac.in


