News September 25, 2024
కాలుష్య నివారణకు ఢిల్లీలో కృత్రిమ వర్షాలు!

నవంబర్ నెలలో తీవ్ర స్థాయిలో ఉండే కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షాల సృష్టికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవంబర్ 1 నుంచి 15 తేదీల మధ్య వర్షాల సృష్టికి అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాసినట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 21 పాయింట్ల అజెండాతో కాలుష్య నివారణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, ప్రత్యేక బృందాలు, యంత్రాలను మోహరించనున్నట్టు వివరించారు.
Similar News
News February 26, 2025
తన రాతను తానే మార్చుకుని.. ఛాంపియన్గా!

పుట్టుకతోనే HIV సోకడంతో సమాజమంతా ఆమెను వెలివేసింది. బంధువులెవరూ దగ్గరకు రానివ్వని వేళ తన చేతిరాతను మార్చుకునేందుకు రన్నింగ్ ట్రాక్లోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు అథ్లెట్ సోనికా సంజు కుమార్. మాజీ అథ్లెట్ ఎల్విస్ జోసెఫ్ & బెంగుళూరు స్కూల్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ (BSSF) చొరవతో రన్నింగ్లో నైపుణ్యం పెంచుకుంది. అప్పటి నుంచి టోర్నమెంట్స్లో పాల్గొంటూ మెడల్స్ సాధించి ఔరా అనిపిస్తోంది.
News February 26, 2025
అన్ని దేశాలూ సెంచరీలు.. పాక్ మాత్రం..!

ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (177) శతకం బాదారు. దీంతో పాకిస్థాన్ తప్ప టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లు సెంచరీలు నమోదు చేశాయి. 2 మ్యాచులు ఆడినా పాక్ నుంచి ఏ ఒక్కరూ సెంచరీ చేయలేకపోయారు. దీంతో SMలో నెటిజన్లు ఆ జట్టును ట్రోల్స్ చేస్తున్నారు. బంగ్లాపైనైనా పాక్ ఆటగాళ్లు శతకం చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
News February 26, 2025
ముగిసిన KRMB సమావేశం

TG: హైదరాబాద్ జలసౌధలో ఇవాళ కొనసాగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తమకు మే నెల వరకు 55 టీఎంసీల నీరు కావాలని ఏపీ, 63 టీఎంసీలు కావాలని తెలంగాణ బోర్డుకు తెలిపాయి. ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ సమావేశమయ్యారు.