News October 11, 2024
ఆర్టిలరీ షెల్ పేలి ఇద్దరు అగ్నివీర్లు మృతి

మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు అగ్నివీర్ ట్రైనీలు ప్రాణాలు కోల్పోయారు. ట్రైనింగ్‌లో భాగంగా ఫైరింగ్ చేస్తుండగా ఆర్టిలరీ షెల్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విశ్వరాజ్ సింగ్ (20), సైఫట్ షిట్ (21) మరణించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. నాసిక్‌లోని డియోలాలి శిక్షణాకేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Similar News
News December 13, 2025
SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

<<18500647>>RBI<<>> రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.
News December 13, 2025
బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలివే..

40 ఏళ్లు దాటిన మహిళలు ఎప్పటికప్పుడు బ్రెస్ట్‌లో వచ్చే మార్పులను గమనిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. రొమ్ములో కొంత భాగం గట్టిపడటం, రొమ్ము చర్మం రంగు మారడం, చను మొన ప్రాంతంలో పుండ్లు, బ్రెస్ట్ నుంచి స్రావాలు రావడం, చంకల కింద గడ్డలు కనిపించడం అనేవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు. కాబట్టి రొమ్ముల్లో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 13, 2025
స్టూడెంట్ కిట్లకు రూ.830కోట్లు

AP: వచ్చే విద్యాసంవత్సరంలో స్టూడెంట్ కిట్ల(సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర) కొనుగోలుకు ₹830Cr విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో కేంద్రం వాటా ₹157Crగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నోట్బుక్లు, బెల్ట్, షూలు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాం క్లాత్‌లతో కిట్లు పంపిణీ చేయనుంది. అలాగే యూనిఫాం కుట్టు కూలీని కూడా పేరెంట్స్‌కు అందజేయనుంది.


