News June 2, 2024

నేడే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు

image

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది. అరుణాచల్‌లో ఇప్పటికే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికవగా ఈరోజు మిగతా 50 స్థానాలకు లెక్కింపు జరుగుతుంది. మరోవైపు సిక్కింలోనూ 32 స్థానాల భవితవ్యం నేడు తేలనుంది. కాగా ఈ రెండు రాష్ట్రాల లోక్‌సభ స్థానాల ఫలితాలు 4వ తేదీన వెల్లడవుతాయి. <<-se>>#Elections2024<<>>

Similar News

News January 21, 2025

పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి?

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన <<15211460>>ఎన్‌కౌంటర్‌లో <<>>14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి కాగా, ఆయనపై గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండ్రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

News January 21, 2025

GOOD NEWS.. జీతాలు పెంపు

image

TG: సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు, స్వీపర్ల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మండల లెవల్ స్టాక్ పాయింట్లు, GCC పాయింట్ల వద్ద పనిచేస్తున్న హమాలీలకు క్వింటాల్‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.26 ఛార్జీకి రూ.3 అదనంగా, గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు వేతనం రూ.1000 పెంచింది. ఇకపై వారు రూ.6000 జీతం అందుకోనున్నారు. అలాగే హమాలీ డ్రెస్సు స్టిచ్చింగ్ ఛార్జీలు రూ.1300 నుంచి రూ.1600కు పెంచినట్లు జీవోలో పేర్కొంది.

News January 21, 2025

టెట్ అభ్యర్థులకు అలర్ట్

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ప్రిలిమినరీ ‘కీ’ని ఈనెల 24న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 27న సా.5 గంటల వరకు పూర్తి ఆధారాలతో https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు. పరీక్షలు నిన్నటితో ముగియగా, మొత్తం 2.05 లక్షల మంది హాజరయ్యారు. 74.44% హాజరు నమోదైంది.