News February 26, 2025
రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్?

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను లుధియానా వెస్ట్ అసెంబ్లీ నుంచి బరిలోకి దించారు. దీంతో ఎంపీ స్థానం ఖాళీ కావడంతో కేజ్రీవాల్ దాన్ని భర్తీ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.
Similar News
News February 26, 2025
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతులివే

☛ HYDలో మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలి
☛ RRR ఉత్తర భాగంలో 90% భూ సేకరణ పూర్తయినందున దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలి
☛ RRRకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి
☛ మూసీ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల సాయం
☛ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 222.7ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకారం
☛ TGకి అదనంగా 29 IPS పోస్టులు మంజూరు చేయాలి
☛ సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయాలి
News February 26, 2025
‘ది పారడైజ్’లో బోల్డ్ & వైల్డ్‌గా నానీ!

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి మార్చి 3న ‘RAW STATEMENT’ వీడియో రిలీజ్ కానుంది. దీని ఎడిట్ పూర్తయిందని, ఇందులో నాని బోల్డ్‌గా, వైల్డ్‌గా కనిపించనున్నారని & అనిరుధ్ మ్యూజిక్ అదిరిందని మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోపై అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. కాగా మొన్న రిలీజైన ‘HIT-3’ టీజర్‌లోనూ నానీని వైల్డ్‌గా చూపించారు.
News February 26, 2025
ఎగ్జామ్ టైమ్ అంటే లవర్స్ లేచిపోయే వేళ!

బిహార్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంతో పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటారా! ఇది లేచిపోయే టైమ్ కాబట్టి! ఇక్కడి పరీక్షల్లో పాసవ్వడం ఈజీ కాదు. పాసవ్వకుంటే అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లిచేసేస్తుంటారు. అందుకే ఎగ్జామ్‌పై డౌటుంటే ఎవర్నో చేసుకొనే బదులు తమ లవర్స్‌తో నుదుటున బొట్టు పెట్టించుకొని లేచిపోతారు. రీసెంటుగా ఓ యువతికి అబ్బాయి పాపిట సింధూరం పెట్టడం వైరల్‌గా మారింది.