News April 12, 2025
ఆర్య-2 ALL TIME RECORD

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, కాజల్, నవదీప్ నటించిన ఆర్య-2 మూవీ రీరిలీజ్‌లో అదరగొట్టింది. ఓవరాల్‌గా దాదాపు రూ.8కోట్లు కలెక్షన్లు సాధించింది. అలాగే HYD ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ.64 లక్షలు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన చిత్రాల్లో ఇదే ALL TIME RECORD అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
Similar News
News January 24, 2026
విష్ణుమూర్తికి నైవేద్యం ఏ పాత్రలో పెట్టాలి?

విష్ణువుకు నైవేద్యం సమర్పించడానికి రాగి పాత్ర శ్రేష్టం. పూర్వం విష్ణు భక్తుడైన గుడాకేశుడు తన శరీరం లోహంగా మారాలని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహంతో రాగిగా మారాడు. తన భక్తుని శరీర రూపమైన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణువుకు ప్రీతికరం. శాస్త్రీయంగా కూడా రాగికి బ్యాక్టీరియాను నశింపజేసే గుణం, రోగనిరోధక శక్తిని పెంచే స్వభావం ఉంది. అందుకే దేవాలయాల్లో రాగి పాత్రల్లోనే తీర్థం ఇస్తుంటారు.
News January 24, 2026
బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.
News January 24, 2026
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: మంత్రి గొట్టిపాటి

AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే యూనిట్‌కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో యూనిట్‌పై రూ.1.19 తగ్గించి రూ.4కే ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19 ఉండేదని, అందులో 29 పైసలు తగ్గించామని చెప్పారు. మరో 90 పైసలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.


