News April 2, 2024
బ్రెజిల్ నటితో ఆర్యన్ ఖాన్ డేటింగ్?

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బ్రెజిల్ నటితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 26 ఏళ్ల ఆర్యన్.. 34 ఏళ్ల నటి లారిస్సా బోనేసితో కలిసున్న వీడియో వైరల్ అవుతుండటం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. అంతేకాక తన అరంగేట్ర సినిమాతో బిజీగా ఉన్న ఆర్యన్ ఇన్స్టాలో లారిస్సా ఫ్యామిలీని ఫాలో అవుతున్నారట. ఇటీవల లారిస్సా తల్లి బర్త్ డే సందర్భంగా విలువైన బహుమతిని కూడా అందజేసినట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
Similar News
News November 6, 2025
బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవబోతున్నామని మంత్రులతో మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్పై ఆయన వారితో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 3 రోజుల్లో ప్రచారంలో దూకుడు పెంచాలని సూచించారు. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సర్వే వదులుతూ ప్రజలు, ఓటర్లను బీఆర్ఎస్ గందరగోళానికి గురి చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలన్నారు.
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 6, 2025
WPL-2026.. రిటైన్ లిస్టు ఇదే..

WPL-2026 ఎడిషన్ కోసం ఢిల్లీలో ఈనెల 27న వేలం జరగనుంది. దీనికి ముందు 5 జట్లు పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఆ జాబితా ఇదే..
RCB: స్మృతి మంధాన(3.5Cr), రిచా ఘోష్(2.75Cr), పెర్రీ(2Cr), శ్రేయాంక(60L)
MI: హర్మన్ప్రీత్, బ్రంట్, హేలీ, అమన్జోత్, కమలిని
DC: జెమీమా, షఫాలీ, అన్నాబెల్, మారిజాన్, నికి ప్రసాద్
UP వారియర్స్: శ్వేతా సెహ్రావత్
గుజరాత్: ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ


