News September 23, 2024

కుటుంబపరంగా మేం కలిసే ఉన్నాం: శరద్ పవార్

image

అజిత్ ప‌వార్‌తో కుటుంబ‌ప‌రంగా క‌లిసే ఉన్నామ‌ని NCP SP చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ అన్నారు. బాబాయ్‌-అబ్బాయి మ‌రోసారి క‌లిసి ప‌నిచేయాల‌న్న డిమాండ్ల‌పై ఆయ‌న‌ స్పందించారు. కుటుంబ‌ప‌రంగా ఇద్ద‌రం క‌లిసే ఉన్నామ‌ని, రాజ‌కీయంగా ఆయ‌న మ‌రో పార్టీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు. బారామ‌తిలో సుప్రియ సూలేపై త‌న భార్య‌ను పోటీకి దింపి త‌ప్పు చేశాన‌ని అజిత్ ప‌వార్ గ‌తంలో ప‌శ్చాత్తాపం చెందారు.

Similar News

News January 20, 2026

బంగారం ఆల్ టైమ్ హై.. 10 గ్రా. రూ.1.52 లక్షలు

image

పసిడి పరుగులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి పెరిగి ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర ఏకంగా రూ.1,52,000 (3 శాతం జీఎస్టీతో కలిపి) దాటింది. సిల్వర్ కూడా రిటైల్ ధర కిలో రూ.3,39,900 (3% GSTతో కలిపి) పైనే పలుకుతోంది.

News January 20, 2026

రిపబ్లిక్ వేడుకలకు సీఎం రేవంత్ దూరం

image

TG: CM రేవంత్ రెడ్డి రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావడం లేదు. JAN 25 నుంచి 30 వరకు USలోని హార్వర్డ్ వర్సిటీలో లీడర్‌షిప్ శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు. JAN 23న దావోస్ పర్యటన ముగిసిన వెంటనే, ఆయన అమెరికా వెళ్లి కొంతమంది పారిశ్రామికవేత్తలను కలుస్తారు. తర్వాత యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యమంత్రి లేకుండానే ప్రసంగిస్తారు.

News January 20, 2026

పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.