News April 26, 2024
అభి’షేక్’ చేస్తున్నాడుగా.. WCలో చోటు దక్కేనా?

SRH ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్లో అదరగొడుతున్నారు. 8 మ్యాచుల్లో 288 రన్స్ చేశారు. దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. టీ20ల్లో ఇలాంటి తరహా ఆట ఎంతో ముఖ్యమని, వరల్డ్ కప్ జట్టులో ఇతడికి చోటు కల్పించాలని పలువురు కోరుతున్నారు. అభిషేక్ శర్మ హిట్టింగ్ కెపాసిటీ బాగుందని, స్ట్రైక్ రేటు అద్భుతంగా ఉందని చెబుతున్నారు.
Similar News
News January 29, 2026
173 ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 173 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(CS) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uco.bank.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 29, 2026
గర్భ నిరోధక ఇంజెక్షన్

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. వీటికి ప్రత్యామ్నాయంగా గర్భ నిరోధక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. దీన్ని డీఎంపీఏ ఇంజెక్షన్ (డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్) వాడతారు. ఇందులో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. 3నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు. ఆ తర్వాత నెల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవచ్చు.
News January 29, 2026
రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/


