News November 23, 2024

పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాలిలా..

image

మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. NDA తరఫున పుణె, బల్లార్‌పూర్, డెగ్లూర్, షొలాపూర్, లాతూర్ నియోజకవర్గాల్లో జనసేనాని క్యాంపెయిన్ చేశారు. మరాఠీ భాష, హిందుత్వ, సనాతన అంశాలను ఆయన ప్రస్తావించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన షొలాపూర్ సహా నాందేడ్, నయాగావ్, భోకర్ ప్రాంతాల్లో సైతం మహాయుతి ఆధిక్యంలో ఉండటం గమనార్హం.

Similar News

News December 16, 2025

పెళ్లి వార్తలను ఖండించిన హీరోయిన్ మెహ్రీన్

image

తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను హీరోయిన్ మెహ్రీన్ ఖండించారు. ఓ వ్యక్తితో తనకు పెళ్లి జరగబోతున్నట్లు ఆర్టికల్స్ రాశారని, కానీ అతనెవరో తనకు తెలియదని, ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ఒకవేళ తాను నిజంగా మ్యారేజ్ చేసుకుంటే అందరికీ తెలియజేస్తానని పేర్కొన్నారు. ఫేక్ ఆర్టికల్స్ రాయడంపై ఫైరయ్యారు. పొలిటీషియన్ భవ్య బిష్ణోయ్‌తో ఆమెకు 2021లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. తర్వాత పెళ్లి రద్దయింది.

News December 16, 2025

భార్య నల్లగా ఉందని..

image

AP: పల్నాడు(D) వినుకొండలో అమానవీయ ఘటన జరిగింది. భార్య నల్లగా ఉందని భర్త, అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తమామలు వేధించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. లక్ష్మి, కోటేశ్వరరావులకు ఈ జూన్ 4న వివాహమైంది. ₹12L నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వగా, ఆమె నల్లగా ఉందనే సాకుతో అదనపు కట్నం కోసం వేధించారు. తాజాగా గెంటేయడంతో భర్త ఇంటి ముందు లక్ష్మి ధర్నా చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

News December 16, 2025

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

image

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్‌వర్త్‌ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌లో 500B డాలర్ల మార్క్‌ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ సుమారు $677Bగా ఉంది.