News December 24, 2024
అసద్‌కు ఇంటిపోరు.. విడాకులకు భార్య దరఖాస్తు?

సిరియాలో తిరుగుబాటుతో రష్యాలో తలదాచుకుంటున్న మాజీ అధ్యక్షుడు బషర్ అసద్‌కు ఇప్పుడు ఇంటిపోరు మొదలైంది. అతని భార్య అస్మా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె రష్యా కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. లండన్ తిరిగెళ్లేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేకపోవడమే డివోర్స్ కారణమట. అయితే ఈ వార్తలను అధికారులు ఖండించారు.
Similar News
News November 13, 2025
విశాఖలో 99పైసలకే రహేజాకు 27.10 ఎకరాలు

AP: VSP IT సెక్టార్లో 27.10 ఎకరాలు కేవలం 99 పైసలకే ‘రహేజా’కు ఇస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. అదనంగా ఆర్థిక రాయితీలు ఇస్తామంది. పైగా ₹91.20CRతో రోడ్లు, నీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తామంది. కాగా ₹2172.26 CRతో ఐటీ, రెసిడెన్షియల్ స్పేస్ నిర్మిస్తామని, 9681 జాబ్‌లు కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. ₹కోట్ల విలువైన భూమిని సదుపాయాలు కల్పించి మరీ 99 పైసలకే ‘రియల్’ సంస్థకు ఇవ్వడంపై అనేక ప్రశ్నలొస్తున్నాయి.
News November 13, 2025
రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డైటీషియన్ల సలహాతో అథ్లెట్లు, బాడీబిల్డర్లు 3-4 గుడ్లు తినొచ్చు. గుండె జబ్బులు, అధిక ఎల్‌డీఎల్, డయాబెటీస్ ఉన్నవాళ్లు, ఆహారంలో సంతృప్త కొవ్వులు తీసుకునేవారు గుడ్లు అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.
News November 13, 2025
2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.


