News January 28, 2025

అసలేంటీ DeepSeek

image

ఇదొక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) కంపెనీ. హై ఫ్లయర్ హెడ్జ్ ఫండ్ కంపెనీ ఫౌండర్ లియాంగ్ వెన్‌ఫాంగ్ దీనిని నెలకొల్పారు. కమర్షియల్ రిటర్న్ లేకుండా ఓపెన్ సోర్స్ విధానంలో AIమోడల్‌ను డెవలప్ చేశారు. ఇందులో లక్షలాది స్టూడెంట్స్, యూత్ పాల్గొన్నారు. ఓపెన్ సోర్స్ కావడంతో దీనినెవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. గుత్తాధిపత్యం ఉండదు. ఇది ChatGPT లాంటిదే. US ఆంక్షలున్నా DeepSeekను రూపొందించారు.

Similar News

News January 13, 2026

చిరంజీవి ‘MSVPG’ మూవీ పైరసీ

image

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఆన్‌లైన్ సైట్లలో ప్రత్యక్షమైంది. మూవీ రిలీజైన 24 గంటల్లోనే పైరసీ కాపీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఖుషీగా ఉన్న ఫ్యాన్స్.. పైరసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని మండిపడుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 13, 2026

IPL 2026లో RCBకి కొత్త హోంగ్రౌండ్!

image

వచ్చే IPL సీజన్ కోసం RCBకి కొత్త హోంగ్రౌండ్స్ ఎంచుకుందన్న వార్తలు వైరలవుతున్నాయి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచులు నిర్వహించేందుకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆడాల్సిన 7 హోంగ్రౌండ్ మ్యాచుల్లో 5 DY పాటిల్ స్టేడియం(నవీ ముంబై), 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని తెలుస్తోంది. RCB కప్పు కొట్టిందని చిన్నస్వామిలో నిర్వహించిన కార్యక్రమంలో 11మంది చనిపోయిన విషయం తెలిసిందే.

News January 13, 2026

శని త్రయోదశి ప్రత్యేక పూజ

image

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్‌లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <>నమోదు చేసుకోండి<<>>.