News October 17, 2025

తుపాకీ వదిలిన ఆశన్న

image

మావోయిస్టు పార్టీలో మరో శకానికి తెరపడింది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 2రోజుల కింద లొంగిపోగా ఇవాళ ఇంకో టాప్ కమాండర్ ఆశన్న(తక్కళ్లపల్లి వాసుదేవరావు) సరెండర్ అయ్యారు. 25ఏళ్లుగా ఆయన ఎన్నో దాడులకు వ్యూహకర్తగా పనిచేశారు. AP CM చంద్రబాబు, మాజీ CM నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై బాంబు దాడితో హత్యాయత్నం, 1999లో IPS ఉమేశ్‌చంద్ర, 2000లో నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలకు నేతృత్వం వహించినట్లు ప్రచారం.

Similar News

News October 17, 2025

దమ్ముంటే కల్తీ మద్యంపై అఖిలపక్ష కమిటీ వేయండి: పేర్ని నాని

image

AP: తమ హయాంలోని QR కోడ్ పద్ధతిని కూటమి తొలగించి కల్తీ మద్యంతో భారీ ఎత్తున దోచుకుందని YCP నేత పేర్ని నాని దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వ బార్ పాలసీ వెనుక స్కామ్ ఉంది. నకిలీ మద్యం అమ్మకం కోసమే రూ.99 లిక్కర్‌ ఆపేశారు. రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం తెచ్చి అమ్మారు’ అని ఆరోపించారు. దీన్ని నిరూపించడానికి తాను సిద్ధమని, దమ్ముంటే అన్ని పార్టీల నేతలతో నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

News October 17, 2025

నేలపై కూర్చొని తింటే ఎన్ని లాభాలో..

image

నేలపై కూర్చొని భోజనం చేసే పవిత్రమైన ఆచారం భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. మనం నేలపై కూర్చొని తినడం పద్మాసన భంగిమను పోలి ఉంటుంది. ఈ పద్ధతి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి.. నేలపై కూర్చొని వినయంతో తినడం ఆహారం పట్ల మన గౌరవాన్ని సూచిస్తుంది. ఈ ఆచారాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.

News October 17, 2025

110 పోస్టులకు నోటిఫికేషన్

image

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, వెల్డర్ తదితర ఉద్యోగాలున్నాయి. టెన్త్+సంబంధిత విభాగంలో ITI పాసైనవారు అర్హులు. వయసు 30ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ OCT 30. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://bdl-india.in/<<>>