News February 11, 2025
ASF:జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న జాడి శ్రావణ్ జాతీయస్థాయి SGFఅండర్ 14సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ యాదగిరి తెలిపారు. మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. క్రీడాకారుడిని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం, PD యాదగిరి, PETప్రసాద్ అభినందించారు.
Similar News
News November 27, 2025
కీరదోసలో ఆకుమచ్చ, వెర్రి తెగులు నివారణ

కీరదోసలో ఆకులమచ్చ తెగులు వల్ల ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి, తర్వాత ఇవి పెద్దగా మారి ఆకు ఎండి రాలిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడి, మొక్క గిడస బారి, పూత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2mlను కలిపి పిచికారీ చేయాలి.
News November 27, 2025
2030లో బంగారం విలువ ఎంత ఉండనుంది?

గత 25 ఏళ్లలో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. 2000లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,400 కాగా ఇప్పుడు అది దాదాపు రూ.1,25,000కి చేరింది. సుమారు 14% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో స్థిరంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030 నాటికి రూ.10 లక్షలు దాటే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు. అయితే పసిడి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.
News November 27, 2025
ప్రకాశం: ఫ్రీ ట్రైనింగ్తో జాబ్.. డోంట్ మిస్.!

ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ బాలికల కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 3 నెలలు ఉచిత శిక్షణ అందిస్తామని, ఆ తర్వాత ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 28లోగా కళాశాలను సంప్రదించాలన్నారు.


