News February 11, 2025

ASF:జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి

image

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న జాడి శ్రావణ్ జాతీయస్థాయి SGFఅండర్ 14సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ యాదగిరి తెలిపారు. మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. క్రీడాకారుడిని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం, PD యాదగిరి, PETప్రసాద్ అభినందించారు.

Similar News

News February 8, 2026

ఆందోల్: మంజీర నదిలో వృద్ధురాలి మృతదేహం కలకలం

image

ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులోని మంజీరా నదిలో సుమారు 65 ఏళ్లున్న ఓ వృద్ధురాలి మృతదేహం కలకలం రేపింది. చాముండేశ్వరి ఆలయ సమీపంలో ఈ మృతదేహాన్ని శనివారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బంది డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్టుమార్టానికి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదైంది.

News February 8, 2026

జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

image

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

News February 8, 2026

విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

image

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌‌ లెస్ కేజీ రూ. 280, స్కిన్‌ రూ. 270లుగా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ. 1000లగా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153లకు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి