News February 7, 2025
ASF: ‘అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్‌లోని టాస్క్ సెంటర్‌ను డీఆర్డీవోతో కలిసి సందర్శించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఏకాగ్రతతో చదవాలన్నారు.
Similar News
News February 8, 2026
రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.
News February 8, 2026
వరంగల్: మల వ్యర్థాలు బహిరంగంగా వేస్తే జైలుకే!

మల వ్యర్థాలను బహిరంగంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం శానిటేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.
News February 8, 2026
ముకుందాపురంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైంది వీరే

ముకుందాపురంలో ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ గల్లంతవ్వగా, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. నీటిలో మునిగిపోయిన భార్యభర్తలు త్రిపురారం(M) కంపాసాగర్ చెందిన పుల్లయ్య, పద్మగా సమాచారం. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


