News March 20, 2025

ASF: ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ కావ్య.. తెలంగాణ టాపర్

image

ఆర్టీసీ ఉద్యోగి బిడ్డ పీజీ ఫలితాల్లో తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కాగజ్‌నగర్ సర్కిల్ కాలనీకి చెందిన శ్రీనివాస్-రాణి దంపతుల రెండో కుమార్తె కావ్య ఈ సంవత్సరం విడుదలైన పీజీ పరీక్షల ఫలితాల్లో సత్తాచాటింది. ఎండీ అనస్థీషియాలో 622 గ్రేస్ మార్కులు సాధించి తెలంగాణ టాపర్‌గా నిలిచింది. కావ్య గాంధీ మెడికల్ కాలేజ్‌లో పీజీ పూర్తి చేసింది. కాగా వీరి మొదటి కుమార్తె నవ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో కొలువు సాధించింది.

Similar News

News December 7, 2025

కోర్ సబ్జెక్ట్ లేదని అనర్హులుగా ప్రకటించలేం: సుప్రీం

image

అభ్యర్థి PGలో కోర్ సబ్జెక్ట్ లేదని అతడిని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో మానిటరింగ్, ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్‌గా ఓ అభ్యర్థి(M.Com) ఎంపికయ్యారు. కానీ స్టాటిస్టిక్స్‌లో PG లేదని అతడిని ప్రభుత్వం తొలగించింది. దీంతో బాధితుడు SCని ఆశ్రయించారు. జాబ్‌కు కావాల్సిన ప్రధాన సబ్జెక్టు అభ్యర్థి చదివాడని, అతడి PG వేరే స్పెషలైజేషన్‌లో ఉందని తిరస్కరించలేమని SC స్పష్టం చేసింది.

News December 7, 2025

స్పీకర్‌కు హరీశ్‌ రావు బహిరంగ లేఖ

image

శాసన సభ నిబంధనలను పాటించకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖలో విమర్శించారు. రెండేళ్లయినా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని నిర్లక్ష్యం చేయడం, ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని హరీశ్ పేర్కొన్నారు.

News December 7, 2025

భారీ జీతంతో రైట్స్‌లో ఉద్యోగాలు..

image

<>RITES <<>>17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు జీతం రూ.60,000-రూ.2,55,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయసు 62ఏళ్లు. డిసెంబర్ 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.rites.com