News April 4, 2024
ASF: ఆ మండలంలో 144 సెక్షన్.. కారణమిదే..!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేస్తూ తహశీల్దార్N. భూమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 17, 2025
ADB: పాఠ్యపుస్తకాల గోదాంను తనిఖీ DEO

ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను నిల్వ ఉంచిన గోదాంను DEO శ్రీనివాస్‌రెడ్డి గురువారం తనిఖీ చేశారు. జిల్లాకు ఎన్ని పుస్తకాలు కావాలి.. మనకు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయో.. పాఠ్య పుస్తకాల మేనేజర్ సత్యనారాయణను అడిగి తెలుసుకొని ఆరా తీశారు. గోదాంలో నిల్వ ఉంచిన పుస్తకాల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. డీఈఓ వెంట సీసీ రాజేశ్వర్ ఉన్నారు.
News April 17, 2025
రోగికి ఆధార్ తప్పనిసరి : ఆదిలాబాద్ DMHO

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఆధార్ కార్డును తీసుకొని వెళ్లాలని ఆదిలాబాద్ DMHO డా.నరేందర్ రాథోడ్ సూచించారు. తద్వారా వ్యాధిగ్రస్థుల సమాచారం అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తామన్నారు. భవిష్యత్తులో రోగికి అందించిన సేవల వివరాలు తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నారు. దీని ద్వారా చికిత్సలు అందించడానికి సులువవుతుందన్నారు. ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాలకు ఆధార్ తీసుకు వెళ్లాలన్నారు.
News April 17, 2025
ADB: భానుడి ప్రతాపంతో విలవిల్లాడుతున్న జనం

భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ మధ్యాహ్నం 12 గంటలకు నిర్మానుష్యంగా మారాయి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు రోజుల నుంచి 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.