News May 16, 2024

ASF: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు 

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులకు రూ.1000 అపరాధ రుసుముతో 16వ తారీకు వరకు గడువు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News January 24, 2025

ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

image

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.

News January 24, 2025

ADB: JAN 28 నుంచి కందుల కొనుగోళ్లు

image

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది నుంచి కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని మార్క్ ఫెడ్ డీఏం ప్రవీణ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 30 నుంచి జైనథ్ మార్కెట్ యార్డ్‌లో సైతం కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కందులను మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలని సూచించారు.

News January 24, 2025

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ADB కలెక్టర్

image

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజార్షిషా అన్నారు. బజార్హత్నూర్ మండలం జాతర్లలో నిర్వహించిన  ప్రజాపాలన గ్రామసభలో గురువారం కలెక్టర్ పాల్గొన్నారు. లబ్ధిదారులు అందిస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి మోహన్ సింగ్, తహశీల్దార్ శంకర్, మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ సౌద్ తదితరులున్నారు.