News March 15, 2025
ASF: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

ఆసిఫాబాద్ జిలాల్లో శుక్రవారం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ దండే విట్టల్ అధ్యర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ దిపక్ తివారి, తదితరులు హాజరయ్యారు. అనంతరం విందును స్వీకరించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మొహమ్మద్ సద్దాం, మొయిన్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
కృష్ణా: తుపాను నేపథ్యంలో.. ఈ జాగ్రత్తలు తీసుకున్నారా..?

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పిల్లలకు పాలు, అవసరమైన వస్తువులు, నిత్యవసర సరుకులు కూరగాయలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ అంతరాయం కలిగినా తుపాను అప్డేట్స్ తెలుసుకునేందుకు సెల్ ఫోన్స్ చార్జింగ్, ఇంట్లో వాటర్ ట్యాంకర్లు నిండుగా ఉంచుకోవాలి.
News October 27, 2025
గన్నవరం నుంచి వైజాగ్ వెళ్లే ఫ్లైట్ రద్దు

విశాఖపట్నంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల గన్నవరం విమానాశ్రయం నుంచి వైజాగ్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
News October 27, 2025
NGKL: పారదర్శకంగా కొనసాగిన మద్యం దుకాణాల కేటాయింపు

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. 67 దుకాణాలకు గాను మొత్తం 1518 దరఖాస్తులు రావడంతో దరఖాస్తుదారుల సమక్షంలో మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు.


