News March 15, 2025

ASF: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

ఆసిఫాబాద్ జిలాల్లో శుక్రవారం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ దండే విట్టల్ అధ్యర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ దిపక్ తివారి, తదితరులు హాజరయ్యారు. అనంతరం విందును స్వీకరించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మొహమ్మద్ సద్దాం, మొయిన్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 8, 2026

బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు మృతి.. చికెన్ తినొచ్చా?

image

AP: అన్నమయ్య(D) సదుం(M) పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభంవారిపల్లెల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోగా పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూతో భయాందోళనలు వ్యక్తం అవుతున్న వేళ వారు కీలక సూచనలు చేశారు. 100 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో వేడి చేసిన చికెన్‌, గుడ్లను తినొచ్చని చెప్పారు.

News February 8, 2026

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు: వరంగల్ కలెక్టర్

image

ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను ఆమె పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

News February 8, 2026

మున్సిపల్ ఎన్నికలు.. వైన్స్, బార్లు బంద్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ వైన్స్, బార్లు బంద్ కానున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.