News January 30, 2025

ASF : ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకోండి

image

తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లకు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆర్.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో అందజేయాలన్నారు.

Similar News

News November 21, 2025

ఇండీ కూటమిని బలోపేతం చేస్తాం: కాంగ్రెస్

image

ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. బిహార్‌లో ఘోర ఓటమితో కూటమి మనుగడపై సందేహాలు మొదలైన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది. ‘INDIA ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ మారలేదు. కూటమిని బలోపేతం చేసేందుకు రెట్టింపు ప్రయత్నాలు చేస్తాం. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్‌లో ప్రతిపక్షాలు సమన్వయంతో ముందుకు సాగుతాయి’ అని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.

News November 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 73

image

ప్రశ్న: యుద్ధంలో ఓడిపోతాం అనే భయంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి ‘మీరు పాండవులపై ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు’ అని నిందిస్తాడు. అప్పుడు భీష్ముడు 5 బాణాలిచ్చి, వీరితో పంచ పాండవుల ప్రాణాలు తీయవచ్చు అని చెబుతాడు. మరి ఆ బాణాల నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 21, 2025

HYD: నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత

image

హైదరాబాద్‌లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదైంది. రాజేంద్రనగర్‌లో 11.5, హయత్‌నగర్‌లో 12.6 నమోదు కాగా, సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది.