News February 11, 2025
ASF: ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా కృషి చేయాలి: RJD

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌లోని రాజేంద్ర ప్రసాద్ బీఎడ్ కళాశాలలో డీఈవో యాదగిరితో కలిసి జిల్లాలో హెచ్ఎంలకు పదో తరగతి వార్షిక పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి, అపోహలు లేకుండా ఏకాగ్రతతో ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News March 19, 2025
HNK: విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న బహిరంగ విచారణ

విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు టిజి ఎన్.పి.డీ.సి.ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో జరిగే ఈ బహిరంగ విచారణలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సవరణ చేయబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడి సర్ఛార్జ్‌ల ప్రతిపాదనలపై విచారణ జరుగుతుందన్నారు.
News March 19, 2025
వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ సేవలు: మహబూబ్‌నగర్ కలెక్టర్

ఇక నుంచి దివ్యాంగుల కోసం వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సేవలను అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష సమావేశం 183 మందికి దివ్యాంగులకు రూ.16 లక్షల విలువైన సహాయ పరికరాలను ఉచితంగా అందజేశారు. అంగ వైకల్యం కలిగిన ఎంతోమంది తమ వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని కలెక్టర్ గుర్తు చేశారు.
News March 19, 2025
మార్చి:19 చరిత్రలో ఈ రోజు

*1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసన సభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
*1952: సినీనటుడు మోహన్ బాబు జననం
*1952: సినీనటుడు, బాబుమోహన్ జననం
*1966: దివంగత ఐపీఎస్ ఉమేశ్ చంద్ర జననం
*1982: ఆచార్య జె.బి కృపలానీ మరణం
*2008: సినీనటుడు రఘవరన్ మరణం
*2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లుస్వరాజ్యం మరణం