News February 23, 2025
ASF: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

ఈనెల 27న జరుగు పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లివ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లివ్లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లివ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.
Similar News
News December 1, 2025
నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.
News December 1, 2025
టీటీడీలో అన్యమతస్తులపై నివేదిక తయారీ

టీటీడీలో అన్యమతస్తుల అంశం మరోసారి తెర పైకి వచ్చింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఇంకా ఎవరైనా ఆన్యమతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.
News December 1, 2025
సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ పారితోష్ పంకజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 మంది సమస్యలు విన్నవించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఎస్పీ ఆదేశించారు.


