News February 23, 2025

ASF: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

image

ఈనెల 27న జరుగు పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లివ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లివ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లివ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.

Similar News

News March 25, 2025

బండి సంజయ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: బీఆర్ఎస్

image

TG: మాజీ సీఎం, BRS అధినేత KCRపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ చేసిన డబ్బునే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారని BRS తన ఫిర్యాదులో పేర్కొంది.

News March 25, 2025

NZB: కాంగ్రెస్ రెండు గ్రూపుల వర్గపోరుపై అధిష్టానం నజర్

image

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో రెండు గ్రూపుల వర్గపోరుపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ ప్రతినిధికి, ఇటీవల పార్టీలో చేరిన ప్రతినిధికి మధ్య జరుగుతున్న వర్గ పోరు తారాస్థాయికి చేరడంతో పలువురు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. BRS హయాంలో కష్ట కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని వాపోతున్నారు.

News March 25, 2025

క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు మొదటి స్థానం జిల్లా కలెక్టర్

image

MBNR జిల్లావ్యాప్తంగా 2,087 మందికి టీబీ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి చికిత్స అందించడంతో 1,218 మంది బాగుపడ్డారని ఇందుకుగాను రాష్ట్ర టీబీ నియంత్రణ విభాగం జిల్లాకు మొదటి స్థానం ఇచ్చిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వివరించారు. మిగిలిన 1,767 మంది రోగులకు నెలకు రూ.వేయి చొప్పున వారికి చెల్లిస్తున్నామన్నారు.

error: Content is protected !!